సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈనెల 28న ఢిల్లీ కి వెళ్లనున్నారు. రాష్ట్రంలో అధికార వైసిపి నేతల ఆదేశాలతో టీడీపీ ఓటర్లు ను లిస్ట్ నుండి అక్రమంగా ఓట్ల తొలగిస్తున్నారని ఆరోపిస్తూ.. ఆయన ఈనెల 28న ఢిల్లీ లో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నాట్లు ప్రకటించారు. ఓట్ల తొలగింపులో ‘ఊరూరా ఉరవకొండ’ లాంటి ఘటనలు ఉన్నాయని సీఈసీ దృష్టికి తీసుకెళ్లి విచారణ కోరతానన్నారు. ఓట్ల అక్రమాలపై ఉరవకొండ, పర్చూరు, విజయవాడ సెంట్రల్, విశాఖ తదితర ఘటనల సాక్ష్యాలను సీఈసీకి చంద్రబాబు అందిస్తానన్నారు. ఇదంతా ప్రభుత్వ వాలంటీర్ల ద్వారా ముందే టీడీపీ – వైసిపి అనుకూల ఓట్ల సమాచారం సేకరించి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం దృష్టికి ఆయన తీసుకెళ్లనున్నారు.
