సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి 68వ పుట్టిన రోజు సందర్భముగా మెగా అభిమానులు కొత్త చిత్ర తాలూకా ప్రకటన విడుదలైయ్యింది .. సంక్రాంతి కి వాల్తేర్ వీరయ్య ఘనవిజయంతో ఎంజాయ్ చేసిన మెగా పాన్స్ కు ఇటీవల రిలీజ్ అయ్యి ఓపెనింగ్స్ కూడా రాక ఘోర పరాజయం పాలయిన ‘భోళా శంకర్‘ సినిమా సాధారణ ప్రేక్షకులకే కాదు మెగా ఫ్యాన్స్ కి కూడా నచ్చ లేదు. అంతేకాకుండా చిరంజీవి కూడా రీమేక్స్ సినిమాలను, పైన 100 కోట్ల బడ్జెట్ సినిమాలని ప్రకటిస్తూ.. పాత తరహా క్వాలిటీ లేని నాసిరకం సినిమాలను మరోసారి తియ్యకండని ఫ్యాన్స్ ఆయనను గట్టిగ కోరారు. దీనితో చిరంజీవి బాగా ఆలోచించారని అందుకే తన తదుపరి సినిమా బాధ్యత ‘బింబిసార’ వంటి సూపర్ హిట్ కొట్టిన కొత్త డైరెక్టర్ వశిష్ఠ కు అప్పచెప్పారు. . మెగా 157 సినిమాను వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా ఎన్టీఆర్ .. జగదేక వీరుడు తరహాలో కొందరు దేవకన్యలు భూమి మీదకు రావడం నరుని ప్రేమలో పడే కథ తో నడుస్తుందని టాప్ హీరోయిన్స్ నటిస్తారని సమాచారం.. సోషియో ఫాంటసీగా ఈ సినిమా తరహాలో పోస్టర్లో పంచభూతాల గుర్తులను వశిష్ట చూపించాడు అంజి, జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఈ సినిమా రాబోతుందన్న మాట..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *