సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషక్తుడు అయిన రోజు నేపథ్యంలో భీమవరంలో బీజేపీ తో పాటు పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో గత ఆదివారం సాయంత్రం భీమవరం చినమీరం నుండి జేపీ రోడ్డు మీదుగా ప్రకాశం చోక్, బుధవారం మార్కెట్ మీదుగా భీమవరం 3 టౌన్ రామాలయం వరకు భారీ బైక్ ర్యాలీని వాయిద్యాల మేళ తో కాషాయ జెండాలతో నినాదాలతో భారీ స్థాయిలో నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ పాక సత్యనారాయణ కూడా పాల్గొనడం, ర్యాలీకి ముందర గుర్రం ఫై ఠీవిగా ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఊరేగించడం హైలైట్ గ నిలిచాయి. దేశంలో హిందూ సామ్రాజ్య విస్తరణకు, సుదీర్ఘ పాలనకు ఛత్రపతి శివాజీ వీరోచిత పోరాటాలు , మహిళల పట్ల విధేయత ను యువత ఆదర్శముగా తీసుకోవాలని వ్యక్తలు పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *