సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం ఆంధ్ర ప్రదేశ్ నుండి టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ , చింతకాయల విజయ్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన సందర్భంగా వారికీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఎలానూ, వారి ఎన్నిక లాంఛనప్రాయం కానున్న దృష్ట్యా రాష్ట్ర అభివృద్ధి కి మీ వంతు కృషి చెయ్యాలని కోరుతూ.. ముందస్తు అభినందనలు రఘురామా తెలిపారు.
