సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడ్జక్షతన నేడు, సోమవారం ఉదయం ఢిల్లీలో ‘జనసేన ప్రస్థానం- జాతీయ సమగ్రత కోసం’ ప్రత్యేక సమావేశం ప్రారంభమైంది.పవన్ కల్యాణ్ ప్రారంభోపన్యాసం చేశారు. జాతీయ సమైక్యతపై జనసేనాని దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీని ప్రారంభించి 12 ఏళ్లు పూర్తైందని తెలిపారు. ఈ 12 ఏళ్లలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశామని ప్రకటించారు. . అధికారంలోకి రావాలన్న ఆశతో పార్టీ పెట్టలేదని.. దేశ సమగ్రతను కాపాడటమే జనసేన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇటీవల పవన్ వ్యవహార శైలిపై ఫై తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో..పవన్ వివరణ ఇచ్చుకొన్నారు. నిజానికి తెలంగాణ ఏర్పాటును తాను వ్యతిరేకించలేదని, ఏపీని కాంగ్రెస్ విభజించిన తీరుపైనే ఆవేదన వెలిబుచ్చామని వివరించారు.. కాంగ్రెస్ విభజించిన తీరు.. అసంతృప్తి, అశాంతిని సృష్టించిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఇరు రాష్ట్రాల ఆస్తుల పంపిణీ, తదితర సమస్యలు అలానే ఉన్నాయన్నారు. ఢిల్లీ మెడలు వంచుతామని చాలా మంది మాట్లాడుతున్నారని.. కానీ ఢిల్లీకి రాగానే ఎవరి నోర్లు పెగలవని విమర్శించారు. దేశ రక్షణకు, భద్రతకు ప్రధాన కేంద్రం ఢిల్లీ అని తెలిపారు. ఈ సమావేశానికి జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు రాష్ట్రాల కీలక నాయకులు హాజరయ్యారు.
