సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మున్సిపాలిటీ పరిధిలో గౌరవ మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి మరియు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి ఆధ్వర్యంలో మెప్మా కార్యక్రమాలపై నేడు, బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మెప్మా రిసోర్స్ పర్సన్స్ (RPs), కమ్యూనిటీ ఆర్గనైజర్లు (COs), సిటీ మిషన్ మేనేజర్లు (CMMs) పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన M-Book Keeping, e-MCP మరియు జీవనోపాధి యూనిట్ల ప్రగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. తక్కువ పురోగతి ఉన్న రిసోర్స్ పర్సన్స్ ఈ నెల 29వ తేదీ నాటికి లక్ష్యాలను పూర్తి చేయాలని, లేనిచో సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే e-MCP కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీ లోపు పూర్తిచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మెప్మా జిల్లా అధికారి జి. హేప్సిబా మేడం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అమలు అవుతున్న “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి రిసోర్స్ పర్సన్ తన పరిధిలోని అర్హత గల సంఘ సభ్యులకు బ్యాంకుల ద్వారా మరియు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు అందించేలా చర్యలు తీసుకుని, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించే దిశగా కృషి చేయాలని తెలిపారు.
