సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి శేషాచల కొండల్లో కార్చిచ్చు రేగింది. తిరుపతి నగరానికి శివారు ప్రాంతమైన జీవకోన అటవీ ప్రాంతంలో గత ఆదివారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ అగ్నిజ్వాలలు అదుపులేకుండా కిలోమీటర్లమేర వ్యాపించడంతో అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పడానికి తీవ్రంగాశ్రమించినప్పటికీ నేటి సోమవారం తెల్లవారు జాముకు చాలా మటుకు మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే వేసవి వేడి వాల్ల ? ఎవరైనా కావాలని ఖాళీ స్థలం కబ్జా కోసం వెలది వృక్షాలు కాల్చడానికి చేసిన కుట్ర? అసలు .మంటలు ఎలా వ్యాపించాయనేది తెలియాల్సిఉంది.
