సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం నుండి భీమవరం మీదుగా హైదరాబాద్‌లోని చర్లపల్లి వరకు నడిచే నూతన ‘వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌’ రైలును గత ఆదివారం రాత్రి నరసాపురం రైల్వే స్టేషన్‌లో ఘనంగా ప్రారంభించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కలిసి జెండా ఊపి ఈ రైలును (రైలు నం. 17062) అధికారికంగా ప్రారంభించారు. ​ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ.. హైదరాబాద్ కు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్తగా.. వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అలాగే నరసాపురం నుంచి తిరుపతికి కూడా వీక్లీ రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. నూతనంగా నరసాపురం నుండి చర్లపల్లి వెళ్లే ఈ రైలు (17062) నరసాపురం (NS): నుండి ప్రతి ఆదివారం రాత్రి 20:00 గంటలకు బయలుదేరుతుంది. పాలకొల్లు (PKO): రాత్రి 20:10 గంటలకు. ​భీమవరం టౌన్ (BVRT): రాత్రి 20:35 గంటలకు. చేరుకొని అటుపిమ్మట ఆఖరి స్టేషన్ చర్లపల్లి (CHZ): మరుసటి రోజు ఉదయం 07:50 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. సోమవారం తిరుగు ప్రయాణంలో చర్లపల్లి – నరసాపురం రైలు (17061) రాత్రి 19:50 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 07:00 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *