సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని నేడు, సోమవారం దేవి శరన్నవరాత్రులలో భాగంగా శ్రీ బాల త్రిపురసుందరి దేవి అలంకరణగా భక్తులకు దర్శనం ఇచ్చారు.ఈనేపథ్యంలో భక్తులు విశేషంగా దర్శించుకొంటున్నారు. శ్రీ అమ్మవారి సంపూర్ణ స్వర్ణవస్త్రం ప్రాజెక్ట్ కి హైదరాబాద్ కి చెందిన కలిదిండి అజయ్ బాబు శ్రీ మతి జమి వర్ధని దంపతులు సుమారు రెండు లక్షల ఇరవై వేలు విలువ చేసే 16 గ్రాముల బంగారం శ్రీ అమ్మవారికి సమర్పించారు.ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో వీరికి పూజ ఆశీర్వచనం నిర్వహించారు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తలు అతికెల ఆంజనేయ ప్రసాద గుసిడి నాగ శిరీష కారెంపూడి ఆదిలక్ష్మి మిర్తిపాటి గున్నేశ్వరరావు ప్రసాదం ఫోటో అందచేసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *