సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయానికి సంబంధించిన వివరాలను భక్తులకు తెలియజేసే అధికారిక వెబ్‌సైట్ పేరును మరోసారి మార్చింది. గతంలో tirupatibalaji.ap.gov.in అని పేరుతొ ఉండగా ప్రస్తుతం ttdevasthanams.ap.gov.in గా మార్పు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మార్పును భక్తులు గుర్తించాలని, దానికి అనుగుణంగా టీటీడీకి సహకరించాలని కోరింది. ఆలయానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ పేరు మార్పుని వన్ ఆర్గనైజేషన్, వన్ వెబ్‌ సైట్, వన్ మొబైల్ యాప్‌లో భాగంగా మార్చినట్లు అధికారులు తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలకు సంబంధించిన వివరాలు, దర్శన వేళలు, ఆర్జిత సేవలు, రవాణ వివరాలు, బస వంటి వివరాలను పొందుపరిచారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం కొత్త వెబ్‌సైట్‌ను డిజైన్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *