సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మరో 3 లేదా 4నెలల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణాలో రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. నేటి సోమవారం సీఎం కెసిఆర్ మీడియా సమావేశంలో మొత్తం 115 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితా ప్రకటించారు. పెద్దగా మార్పులేమీ లేవని . కేవలం 7 నియోజక వర్గాలలో మార్పులు చేస్తున్నట్టు తెలిపారు.. వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, ఉప్పల్, కోరుట్ల, స్టేషన్ ఘనపూర్, వైరా సిట్టింగ్స్ మార్పులు చేస్తున్నామన్నారు. మిగతా అన్ని చోట్లా సిట్టింగులతోనే బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. కాగా సీఎం కేసీఆర్ 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. గజ్వేల్‌తోపాటు వికారాబాద్ నుంచి బరిలోకి దిగుతున్న వెల్లడించారు. కాగా నాలుగు చోట్ల కొత్తవారితో పోటీకి దిగుతున్నామన్నారు. కాగా నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామాల్, కొంపల్లి అభ్యర్థుల ప్రకటన పెండింగ్‌లో ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *