సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో నేడు, శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి తోట సీతారామలక్ష్మి ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ ఓ సి దరఖాస్తుదారులు ఇద్దరికీ 8 లక్షల 50వేల రూ మంజూరి పత్రాలను టిడిపి నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు.టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ.. నియోజకవర్గ ఇన్చార్జి తోట సీతారామలక్ష్మి సిఫార్సుతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నేటికీ సుమారు మూడు కోట్ల రూపాయలను 205 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందన్నారు. మాజీ మునిసిపల్ చైర్మెన్ మెరుగని నారాయణమ్మ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు ,ఏపీ కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు కార్పొరేషన్ డైరెక్టర్స్ ఉప్పులూరి చంద్రశేఖర్ ఎం.డి షబీనా తదితర నేతలు పాల్గొన్నారు.
