సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం తోలేరు రోడ్డులో పోలమూరు డ్రెయినేజీపై జరుగుతున్న నూతన వంతెన పనులను స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) నేడు ఆదివారం పరిశీలించారు. ఇప్పటికే పొక్రేన్ లతో మట్టి చదును చేసే కార్యక్రమం ప్రారంభమయింది. పంజా వేమవరం వెళుతూ మార్గ మధ్యలో అయన ఆకస్మికంగా తోలేరు రోడ్డులో జరుగుతున్న పనులను పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులలో స్థానిక రైతులకు, పంటనీరు తదితర ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
