సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. విషయంలోకి వెళ్ళితే .. పవన్ కళ్యాణ్ గత శనివారం సాయంత్రం హైదరాబాద్  అపోలో హాస్పటల్లో శస్త్రచికిత్స జరిగింది. ఆయన గత శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. ఇటీవల చాల ఇబ్బందిగా మారింది. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేశారు, ఇది అధికారిక సమాచారం అయితే. ఇంతకీ శస్త్ర చికిత్స ఏ భాగంలో చేసారో అధికారిక వివరణ లేరు. ఆయన ఎడమ కంటికి అని కొందరు భావిస్తుంటే.. లేదు  సైనసైటిస్ సమస్య కారణంగా ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండేది. అందుకే ముక్కుకు సంబంధించిన సర్జరీ చేసినట్లు మరో అనధికార సమాచారం. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపినట్లుప్రకటన వెలువడింది. పవన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు ,మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా త్వరగా కోలుకోవాలని తమ పోస్టులతో సంఘీభావం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *