సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ అమెరికా మధ్య దాడులు ప్రతిదాడులు జరుగుతున్నా నేపథ్యంలో .. ప్రస్తుతానికి దాడులు చేసుకోరాదని ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ భారత్ లో దేశీయ మార్కెట్ ఫై కాస్త ప్రభావము పడటంతో.. నేటి సోమవారం ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, లాభ నష్టాలతో ఉగిసలాడి చివరకు నేటి సాయంత్రం ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 372.10 పాయింట్లు లేదా 0.48 శాతం నష్టపోయింది. 76,728.37 వద్ద ముగిసింది. ఇక , నిఫ్టీ 109.75 పాయింట్లు లేదా 0.46 శాతం నష్టం తో 23,946.25 వద్ద ముగిసింది. ప్రకాష్ పైప్స్ లిమిటెడ్, బజాజ్ హెల్త్కేర్ లిమిటెడ్, మాక్పవర్ సిఎన్సి మెషీన్స్ లిమిటెడ్, సినీవిస్టా లిమిటెడ్, బోరోసిల్ సైం టిఫిక్ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ గా లాభాలు ఆర్జించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *