సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: RRR, దేవర ఘన విజయాలతో వార్ 2 యావరేజ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి పూర్తీ పారాణిక సినిమాలో కుమారస్వామి పాత్రలో , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మరో భారీ చిత్రం రాబోతోంది. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి క్లాసిక్ మాస్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండో చిత్రం కావడంతో, ఈ ప్రాజెక్ట్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు మేకర్స్ ఓ పోస్టర్‌ను నేడు, సోమవారం విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. ఒక భారీ యుద్ధ భూమి బ్యాక్‌డ్రాప్‌లో, ఆకాశం వైపు చూపిస్తున్న డిఎన్ఏ ఆకృతి కలిగిన త్రిశూలం.. దాని చుట్టూ ఉన్న సంస్కృత శ్లోకం పోస్టర్‌కే హైలైట్‌గా నిలిచాయి.హీరో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ట్వీట్ చేస్తూ సినిమా కథాంశంపై హింట్ ఇచ్చారు. ‘‘శివుని కుమారుడు.. పార్వతికి గర్వకారణం.. శాశ్వత సైన్యాధ్యక్షుడు (కుమారస్వామి/కార్తికేయ బ్యాక్‌డ్రాప్).. మరోసారి త్రివిక్రమ్‌తో…’’ అంటూ ఎన్టీఆర్ తన ఆనందాన్ని పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *