సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశీయ స్టాక్ మార్కెట్ లో గత నెల రోజులుగా ఇన్వెస్టర్స్ కు కాలం కలసి రావడం లేదు. అయితే వరుస నష్టాల నుండి కాస్త తేరుకొని గత 2 రోజులుగా వచ్చిన కొద్దీ లాభాలు నేడు, బుధవారం వచ్చిన నష్టాలతో ‘బేర్’ మన్నాయి, నేటి మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 429 పాయింట్స్ నష్టపోయి 72,638 వద్ద ముగిసింది.అలాగే నిఫ్టీ కూడా 173 పాయింట్స్ నష్టపోయి 22,603 వద్ద ముగిసింది.
