సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మాస్ మహారాజా రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన సినిమా ‘ధమాకా’ ఇటీవల కాలంలో వసూళ్లను సాధించి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌కు భారీ లాభాలను పంచిపెట్టింది. ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వారంతా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.‘ధమాకా’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ రైట్స్ కోసం భారీ ధరను చెల్లించిందని తెలుస్తోంది. ఈ సినిమా జనవరి 22 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు సమాచారం అందుతుంది. చిత్రబృందం అందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన జారీ చేస్తారు.ధమాకా గత డిసెంబర్ 23న విడుదలైంది. యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటించింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించాడు.సంక్రాంతి కొత్త సినిమాల థియేటర్స్ కోసం ధమాకా థియేటర్స్ నుండి అనివార్యంగా తొలగిస్తున్న నేపథ్యంలో నెల తిరగకుండా ఓటిటి లో ప్రేక్షకులకు కనువిందు చేసే అవకాశం రానుంది..
