సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హీరో నాని పాన్ ఇండియా హీరో కావాలని, మాస్ హీరో ఇమేజ్ సాధించాలని గజనిలా ఎన్ని దండయాత్రలు చేసిన అవి మిశ్రమ ఫలితాలే వస్తున్నాయి కానీ నాని మాస్ హీరో కాలేకపోతున్నాడు. ఇక పాన్ ఇండియా మాట మర్చిపోతే మంచిది. ఏది ఏమైనా ఈసారి గట్టిగ కొట్టాలని నాని డిసైడ్ అయినట్లు ఉన్నారు. సీనియర్ హీరో మోహన్ బాబు విలన్ గా, నాని (Nani) హీరోగా కెజిఎఫ్ తరహాలో .. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాని గత 2 ఏళ్లుగా చెక్కుతున్నారు. అయితే దీనిపై పై గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో కొన్ని సీన్స్ నానికి నచ్చలేదని, అందుకే మూవీకి రీషూట్ జరుగుతోందని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలును ‘ది పారడైస్’ నిర్మాతలు రీషూట్ వార్తలను పూర్తిగా తప్పుబట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన 100కి పైగా షూటింగ్ రోజులు విజయవంతంగా పూర్తయ్యాయని, మిగిలిన భాగాల చిత్రీకరణ కూడా షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని తెలిపారు..మొదట మార్చిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను క్వాలిటీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఆగస్టు 21కు మార్చమని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల అవుతుందని నిర్మాతలు మరోసారి ధృవీకరించారు.
