సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఇటీవల చెలరేగిన ఉద్రిక్తతలు అమెరికా జోక్యంతో, ట్రంప్ ఇజ్రాయిల్ నుద్దేశించి చేసిన తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతానికి సద్దు మణిగాయి ట్రంప్ తాజగా మీడియా సమావేశంలో . ఇరాన్‌పై దాడులను కట్టిపెట్టాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు తాను స్పష్టం చేశానని తెలిపారు. పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించానని, నేను బీబీని (నెత్యన్యాహు) హెచ్చరించా.. తన చర్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నా. మాట వినకపోతే చివరకు ఒంటరిగానే ఇరాన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించా’ అని ట్రంప్ మీడియాకు తెలిపారు . ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు హద్దుదాటకుండా అడ్డుకున్నానని తెలిపారు.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి తేవాలని తనను ఐదు దేశాలు కోరడంతో ఆయనకు ఫోన్ చేశానని ట్రంప్ చెప్పారు. ఇజ్రాయిల్ వైఖరిని ఐరోపా దేశాలు ఇప్పటికే ఖండిస్తున్నాయి. విషయం లోకి వెళ్ళితే..ఇరాన్ మిత్రదేశం లెబనాన్‌పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు ఆక్రమణలకు నిరసనగా ఇరాన్ గత శనివారం ఇజ్రాయెల్‌పై మిసైల్స్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. బదులుగా ఇజ్రాయెల్ కూడా వైమానిక దాడులు చేసింది. దానితో రెచ్చిపోయిన ఇరాన్ మరిన్ని మిసైల్స్ తో ఇజ్రాయిల్ ఫై దాడి చేసింది. దానితో ఇజ్రాయిల్ లో స్కూల్స్ ఆఫీసులు సెలవులు ప్రకటించారు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో అమెరికా జోక్యం చేసుకొంది. అయితే మరోసారి లెబనాన్ ఫై ఇజ్రాయిల్ దాడి చేస్తే ఇరాన్ ఇంతకూ మించి బదులు ఇస్తుందని హెచ్చరించింది.
