సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత సాయంత్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన దుర్ఘటన అత్యంత దురదృష్టకరమైనదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ గత రాత్రి భీమవరం లో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. తదుపరి ఆయన వైజాగ్ బయలు దేరి రాత్రి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు చేరుకొని అక్కడ బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చి కేంద్రం అన్ని విధాలా వారి ఆదుకొంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి కారణాలు ఫై అధికారులతో సమీక్షించారు. గత . సోమవారం సాయంత్రం భీమవరంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ.. లిక్విడ్‌ను 1500 డిగ్రీల సెల్సియస్‌తో వేడి చేశారని తెలిపారు. దీనిని లాడెల్‌లో 150 టన్నుల లిక్విడ్‌ను నంబర్ 2 మిషన్ వద్దకు తరలించే సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు.ఈ ప్రమాదంలో 8 మంది మరణించారన్నారు శ్రీనివాసవర్మ. పక్క మిషన్ వద్ద ఉన్న ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని.. నలుగురి పరిస్థితి బాగానే ఉందని తమకు సమాచారం అందిందన్నారు. వారికి మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్ సిద్ధం చేశామని చెప్పారు.
