సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోని తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాలలో వర్షాకాలం ప్రారంభమైనా వరుణుడి జాడనిరవధికంగా కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇప్పటికే ఆలస్యంగా అడుగుపెట్టిన నైరుతి రుతుపవనాలు ఉన్నట్టుండి కనుమరుగయ్యాయా? అనే దానిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా విడుదల చేసిన తాజా ఉపగ్రహ చిత్రాలు సమాధానం ఇచ్చాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ఇప్పటికే విస్తరించిన నైరుతి రుతుపవనాలు ఉపగ్రహ చిత్రాల్లో మాత్రం వాటి జాడ కానరాలేదని ఐఎండీ పేర్కొంది.ఇదంతా సూపర్ ఎల్‌నినో ఎఫెక్ట్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు..నైరుతిలో ఈ స్తబ్దత మరో వారం పాటు కొనసాగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. జూన్ 23వ తేదీ నాటికి వానలు సాధారణ స్థితికి చేరవచ్చని వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. రానున్న వారంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతాలు, అలాగే తూర్పు కనుమల్లో వాతావరణం అనుకూలంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు, మెరుపులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
