సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ లో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ ధర 84.60 డాలర్లకు చేరుకుంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (96.20) భారీగా పతనమైంది.గత సెషన్ ముగింపు లో స్వల్ప లాభాలతో బయటపడినప్పటికీ నిన్నటి (77,616)తో పోల్చుకుంటే నేడు, మంగళవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్దిగా పుంజుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో చివరకు సెన్సెక్స్ 561 పాయింట్ల నష్టంతో 77,054 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ కూడా 158 పాయింట్ల నష్టంతో 24,052 వద్ద స్థిరపడింది (stock market ).అయితే అదానీ పవర్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, అదానీ గ్రీన్ ఎనర్జీ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి,బ్యాంక్ నిఫ్టీ 669 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 274 పాయింట్లు నష్టపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *