సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాన్ ఇండియా సినిమా హీరోలుగా మంచి పామ్ లో ఉన్న జూనియర్ యన్టీఆర్ , అల్లు అర్జున్ పాలిటిక్స్ లో అడుగు పెడుతున్నారని ఈ మధ్య భారీ ప్రచారం జరుగుతుంది.. దానికి తగ్గట్లే వారు కూడా పరోక్షంగా తమ అభిమాన సంఘాల నేతలతో రాజకీయ పార్టీల తరహా లో ‘ఊరువాడా’ అంటూ శక్తివంతమైన నెట్ వర్క్ లుగా , ఆర్మీలు గా తయారు చేస్తూ తమ ప్రభావాన్ని పరోక్షంగా ప్రధాన రాజకీయ పార్టీలు గమనించేలా వ్యవహరిస్తున్నారు అన్నది వాస్తవం.. గతంలో తమిళ హీరో విజయ్ కూడా ఇదే తీరున సుదీర్ఘ ప్లాన్ నడిపారు. విజయ్ పార్టీ అని అయన తండ్రి చంద్ర శేఖర్ మొదటిగా 6 ఏళ్ళు క్రిందటే స్థాపించి సంచలనం రేపగా ..అపట్లో విజయ్ ఆ వార్తలను ఖండించి, అప్పటి ప్రధాన పార్టీలతో తన సినిమాలకు ఇబ్బందులు రాకుండా ప్యూహాత్మకంగా? తండ్రి పైనే కేసు పెట్టాడు. కానీ అభిమానులు ప్రజలు నాడీ గమనించాడు. మరి ఇప్పుడు ఆయనే తమిళనాడు సీఎం కాగా అయన తండ్రి, చంద్ర శేఖర్ టీవీకేపార్టీ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా జూలై 18వ తేదీన తిరుపతి లో తన పొలిటికల్ ఎంట్రీపై యన్టీఆర్ క్లారిటీ ఇస్తారనీ ప్రచారం జరిగింది.ఎంత కాదనుకున్న జూ. ఎన్టీఆర్ కు బలమైన రాజకీయ నేపథ్యం, అనుభవం ఉన్నాయి. అయితే అవేవీ నిజం కాదని యన్టీఆర్ అభిమాన సంఘాలు ఖండించాయి. 100 కోట్ల నిధితో ప్రజా స్వచ్చంద సంస్థ ను ఏర్పాట్లు చెయ్యాలని ఎన్టీఆర్ ఆలోచిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అలాగే అల్లు అర్జున్ అభిమాన సంఘాలు కూడా దేశవ్యాప్తంగా సంక్షేమ కార్యక్రమాలలో దూసుకొనిపోయేందుకు పలు నగరాలలో జాతీయ స్థాయి బన్నీ ఆర్మీ కి సమావేశాలు జరుపు తున్నారు.. క్లారిటీ ఇప్పట్లో రాదు కానీ ..సినీ హీరోలు ఎవరైనా సరే, కొత్త ప్రాంతీయ పార్టీ పెట్టాలా? ఉన్న జాతీయ పార్టీలలో చేరాలా? అన్నది కాదు....ఎప్పుడు రాజకీయాలలోకి వచ్చామన్నది కాదు.. ఎప్పటికైనా అధికారంలోకి రాగలమా? లేదా? అన్నదే లక్ష్యం.. ఇది ప్రజాస్వామ్య దేశం.. ఓటర్లు మనస్సు గెలుచుకొంటే సీఎంలు ప్రజా ప్రతినిధులు కావడం తప్పులేదు.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *