సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో నేడు, మంగళవారం ఘోర అగ్నిప్రమాదంజరగటం పై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరో వైపు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తు… బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.
