సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలలో తెలుగు దేశం అభ్యర్థులు 4 చోట్ల పోటీ చేస్తున్నట్లు మొదటి లిస్ట్ లోనే ప్రకటించారు. ఇది ఇలా ఉండగా ఉండి, తణుకు నియోజకవర్గాల్లో చివరి వరకు టికెట్లు ఆశించి భంగపడిన ఇద్దరు కీలక అభ్యర్థులు ఇంకా తగ్గేదే లే.. అన్న తీరున వారి అనుచరులతో సమావేశమై ఏది ఏమైనా ఈ ఎన్నికలలో అభ్యర్థులుగా బరిలో ఉంటామని ప్రకటించి సంచలనం రేపుతున్నారు. తణుకులో టికెట్ టీడీపీ కి కేటాయించడం తో జనసేన ఇన్చార్జివిడివాడ రామచంద్రరావు తన అనుచరులతో అసమ్మతి స్వరం వినిపిస్తుండటం సాధారణంగా తీసుకున్నప్పటికీ, భీమవరం జంట నియోజకవర్గంగా ఉండే ఉండిలో మాత్రం సమస్య జనసేన నుండి కాదు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు నుండి.. అయిన భీమవరం లోనే కొద్దీ కాలం క్రితం పట్టణంలో ఉండి నియోజకవర్గ 2వ టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించి తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పారు. గతంలో తాను 2 పర్యాయాలు ఉండి ఎమ్మెల్యేగా గెలిచానని, కానీ 2019 లో స్థానిక నరసాపురం ఎంపీ సీటు పోటీ చెయ్యాలని అధిష్టానం ఆదేశించడంతో తప్పని పరిస్థితులలో ఉండి అసెంబ్లీ ని వదులుకున్నానని ఇప్పుడు నా సీటు నాకు కేటాయించమంటే టీడీపీ పట్టించుకోకపోవడం నా గౌరవానికి భంగకరంగా ఉందని , ఉండిలో టీడీపీ పార్టీ కోసం సర్వము ఒడ్డానని, అందుకే ఇక్కడ ఎన్నికలలో పోటీ చేసి నాపై ప్రజాభిమానం నిరూపించుకొంటానని ఆయన తిరుగుబాటు స్వరం గట్టిగ వినిపిస్తున్నారు. సందడిలో సడేమియా అంటూ టీడీపీ కి కంచుకోట అయిన ఉండి లో అధికార వైసిపి నేతలు ఈ పరిణామాలు ఈసారి తమ గెలుపుకు ఏ విధంగా ఉపయోగపడతాయో? అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *