సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ రంగాల నుండి రావలసిన వాణిజ్య పన్నులను వేగవంతంగా వసూలు చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. నేడు, గురువారం భీమవరంలో జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు నిర్దేశించిన రూ.485 కోట్ల లక్ష్యానికి 85.41 శాతం వసూళ్లు సాధించామని, వృత్తి పన్ను వసూళ్లలో 86.72 శాతం సాధనతో రాష్ట్రంలో జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రూ.543.02 కోట్ల వాణిజ్య పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ లక్ష్యంలో భాగంగా వృత్తి పన్ను ద్వారా రూ.16.65 కోట్లు, ఇతర బకాయిల ద్వారా రూ.40.61 కోట్లు, వ్యాట్ పాత చలాన్ల ద్వారా రూ.35.42 కోట్ల వసూళ్ల లక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలో నమోదైన పీహెచ్‌సీలు, ఎంపీడీవోలు, దేవాలయాలు తదితర శాఖలు ప్రతి నెల 10వ తేదీలోపు నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.. జీఎస్టీ అమలులో భాగంగా నకిలీ సంస్థలు, ఉనికిలో లేని పన్ను చెల్లింపుదారులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టామని, కొన్ని సంస్థలు పేర్కొన్న చిరునామాల్లో లేకపోవడం, వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకపోవడం గుర్తించామని, ఏపీ జీఎస్టీ చట్టం-2017 ప్రకారం సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు తదితర రంగాల సమాచారంతో కేసులు నమోదులు చేపట్టినట్లు చెప్పారు.. ..
