సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: 2016లో పాత రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.అయితే తాజగా కేంద్ర ప్రభుత్వం గతంలో రద్దు చేసిన పాత నోట్ల కు కొత్త నోట్లు మార్పునకు ఆర్బీఐ నిజంగా మళ్లీ ఛాన్స్ ఇచ్చిందా?ఇటీవల .సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్క్రీన్‌షాట్ ప్రకారం.. ‘పాత రూ. 500 రూ. 1000 రూపాయల నోట్లకు ఆర్‌బిఐ కొత్త నిబంధనలను జారీ చేసింది. ఆ పోస్టులో ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఫొటో కూడా ఉంది. అయితే ఈ వార్తలో నిజం లేదని పిఐబి తేల్చిచెప్పింది. ఎక్స్ వేదికగా పీఐబీ పోస్టు చేసింది.. ‘ఈ పోస్టు పూర్తిగా అవాస్తవం. ఆర్‌బీఐ ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. ఇలాంటి మెసేజ్ సరిచూసుకోకుండా ఎప్పుడూ ఎవరికీ ఫార్వార్డ్ చేయవద్దు.అందరూ జాగ్రత్తగా ఉండండిఏవైనా అనుమానాస్పద మెసేజ్, ఫొటోలు లేదా వీడియోలు మీకు వస్తే.. దయచేసి మాకు పంపండి. మేం వాటిపై దర్యాప్తు చేస్తాం.’ అని పేర్కొంది.
