సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు శుక్రవారం భీమవరం డీఎన్ఆర్ గెస్ట్ హౌస్ వద్ద ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) జర్నలిస్టుల కోసం ‘తొలిసారి’ ఏర్పాటు చేసిన వార్తాలాప్ వర్క్‌షాప్‌ను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.​ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ ఒక్కరోజు వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూలల నుంచి విలేకరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేస్తారని , అయితే ఈ పోటీ ప్రపంచంలో సంచలన కథనాలతో పాటు . లబ్ధిదారుల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వివిధ పథకాలపై సమగ్ర అవగాహన కలిగే విధంగా లబ్ధిదారుల విజయాలు తో కథనాలు ప్రచురించాలని ఆయన కోరారు.ఎంపీ పాక వెంకట సత్యనారాయణ రైతుల సంక్షేమమే భారత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటి ప్రయోజనాలు ప్రజలకు జర్నలిస్టులు తమ కథనాలు ద్వారా తెలియజేయాలని కోరారు. పిఏబి డైరెక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, జర్నలిస్టులకు మధ్య పీఐబీ ఒక కీలకమైన అనుసంధానకర్తగా పనిచేస్తుందని, వివిధ విధానాలు, కార్యక్రమాలు, పధకాలపై ప్రామాణికమైన సమాచారాన్ని సకాలంలో అందిస్తుందని తెలిపారు. ఇలాంటి వర్క్‌షాప్‌లు మీడియాకు వివిధ ఫ్లాగ్‌షిప్ స్కీమ్‌లు, ప్రోగ్రామ్‌లు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత అవగాహన కల్పించేందుకు సహాయపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ ఆనంద్, పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *