సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం స్వాతంత్ర్య సమరయోధుడు విప్లవాగ్ని ,అల్లూరి సీతారామారాజు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం మన్యం ప్రజల గుండెల్లో పౌరుషాగ్ని రగిలించిన విప్లవ యోధుడు అల్లూరి అని అన్నారు. తెల్లవారిని గడగడలాడించిన తెలుగువీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆ దేశభక్తుని చరిత్రను స్మరించుకుంటూ నివాళి అర్పిద్దాం అంటూ పోస్ట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ , మాజీ సీఎం జగన్, మంత్రి లోకేష్, తదితరులు అల్లూరికి ఘన నివాళ్లు అర్పించారు.
