సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పిఠాపురం టీడీపీలో ఊహించని బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలంగా టీడీపీ కి కీలక నేతగా, మాజీ ఎమ్మెల్యేగా పార్టీ ఆదేశంతో తన సీటును కూడా జనసేన కు వదిలేసిన ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఫై ఇటీవల స్థానిక జనసేన నేతలతో తరుచు మాటల యుద్ధం, ప్రోటోకాల్ వివాదాలపై చంద్రబాబు సీరియస్అయ్యారు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కూటమికి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతో వర్మ బాధ్యతలకు కోత పెడుతూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రస్తుత టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను బాధ్యతల నుంచి తప్పిస్తూ, త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయించింది.పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పిఠాపురంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సహజంగానే స్థానికంగా జనసేన పట్టు పెరిగిపోయింది. దీనితో స్థానిక టీడీపీ నాయకుల్లో అసంతృప్తి పెరగడం కనిపించింది. జనసేనతో సమన్వయం విషయంలో వర్మ శైలిపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇది టీడీపీ వర్గాలకు ఎటువంటి సంకేతం ఇస్తుందో?నిజానికి పవన్ కళ్యాణ్ కూడా టీడీపీ నేతలతో దురుసుగా ప్రవర్తించవద్దు .. ‘కూటమి మాత్రమే ముఖ్యం’ .. కలసి ఉంటేనే అధికారం.. మరో 15 ఏళ్ళ కూటమి కోసం ఎవరిని లెక్కచేయను. అంటూ తరుచు జన సైనికులకు ఉద్భోద చేస్తూనే ఉంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *