సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ నుండి ఒప్పందం ప్రకారం ముడి చమురు కొంటామని తమ నౌకలను అమెరికా ఆపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చైనా తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో .. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మనదేశ ప్రధాని నరేంద్రమోడీ కాల్ చేశారు. వారిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలం అయిన విషయం తెలిసిందే. ఇరాన్ ను దిగ్బంధం చెయ్యడానికి ప్రస్తుత తరుణంలో సముద్ర మార్గాలను అమెరికా దిగ్బంధనం చేసింది. దీనివల్ల భారతదేశం ముడి చమురు గ్యాస్ నౌకలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో మోదీ యుద్ధానికి సంబంధించి పలు అంశాలపై ట్రంప్‌తో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు, యుద్ధం మళ్లీ పెరగకుండా నియంత్రించడం వంటి అంశాలపై మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా యుద్ధం ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్ తమ అమెరికా కు పూర్తి మద్దతు ఇస్తుందని తాజగా అధ్యక్షుడు ట్రంప్‌తో స్పష్టం చేశారు. మరి, అమెరికన్స్ తో పాటు ప్రపంచం ఈసడించుకొంటున్న ట్రంప్ నిర్ణయాలు కు భారత్ మద్దతు పలుకుతుందా ?
