సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ఇంటర్ ఫలితాలు నేడు, బుధవారం విడుదలయ్యాయి. నేటి ఉదయం మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో రికార్డు స్థాయిలో ఉత్తీర్ణత నమోదు అయ్యింది. గత 12 ఏళ్లలో అత్యధికంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 77 శాతం పాస్ అయ్యారు. రెండో సంవత్సరం విద్యార్థులు 81 శాతం పాస్‌తో రెండో అత్యుత్తమ ఫలితాలను సాధించారు. విద్యార్థులు తమ ఫలితాలను resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ‘Hi’ మెసేజ్‌ను 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో పంపితే విద్యార్థుల ఫలితాలు సమాచారం అందుతుంది..
