సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుమారు 4 నెలలుగా ప్రపంచాన్ని కలవర పెట్టిన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 80వ జన్మదినం సందర్భముగా ప్రకటించారు. దీనిని ఇరాన్ కూడా ఈ ప్రకటనను కొంతమేర నిర్ధారించింది. ఎలాంటి సుంకం లేకుండా హోర్ముజ్ జలసంధి తెరుచుకుంటుంది చెప్పారు. ఇరాన్ ఫై ఆంక్షలు సడలిస్తున్నానని ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని అమెరికా సైన్యాన్ని ఆదేశించానని కూడా తెలిపారు. హర్ముజ్ లో ‘షిప్‌ల ఇంజన్లను స్టార్ట్ చేయండి, ఆయిల్ తరలించండి’ అంటూ ఉత్సాహంగా పిలుపునిచ్చారు. ఈ పరిణామాలపై ఇరాన్ కూడా స్పందించింది. అమెరికాతో అవగాహన ఒప్పందం మాత్రమే కుదిరిందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి ఘరీబా బాదీ ఈ ప్రకటన చేశారు. ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లో ఒప్పందంపై సంతకాలు చేస్తామన్నారు. . అయితే, డీల్ చేసుకున్నంత మాత్రాన శత్రువులను నమ్మినట్లు కాదని కూడా ఘరీబా బాదీ చెప్పారు. అమెరికా హామీలకు కట్టుబడి ఉంటుందో లేదో పరిశీలిస్తామని అన్నారు. ఈ ఒప్పందం నేపథ్యంలో లెబనాన్ ఫై ఇజ్రాయిల్ మిలటరీ ఆపరేషన్స్ నిలిచిపోనున్నాయి. వీరోచితంగా పోరాటం ప్యూహాత్మక ఎత్తులతో అమెరికా మెడలు వంచిన దేశంగా ఇరాన్ చరిత్రలో నిలిచిపోతుంది.
