సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. పవన్ కళ్యాణ్ పట్ల తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు నాగేశ్వర్ ప్రకటించిన తర్వాత వివాదం సద్దుమణుగుతుందని అందరూ భావించారు. అయినప్పటికీ కేసులు, పోలీసులు అంటూ ఈ అంశం కొనసాగుతూనే వస్తోంది. ఈ క్రమంలోనే గత బుధవారం రోజున హైదరాబాద్‌లో సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ కు చెందిన పలువురు సీనియర్ జర్నలిస్టులతో , తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మీడియా సమక్షంలో జరిగిన సమావేశంలో.. ఏపీ సీఎం చంద్రబాబు , పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ గురించి తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేయటంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర గౌరవం తగ్గించాలని, అన్ని నిజాలే చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ను ఆంధ్ర పాలకులు, ఏపీ పోలీసులు అరెస్ట్ చెయ్యాలని ఇక్కడే తిరుగుతున్నారని, ఆయనను టచ్ చేస్తే చాలు ..ఇక సహించేది లేదని ..మరో తెలంగాణ విమోచన స్థాయి ఉద్యమం పుడుతుందని, ఇక్కడ నివాసాలు ఉంటున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు ను హైదరాబాద్ నుండి తరిమి.. దారుణమైన భాషతో విమర్శించారు. తెలంగాణ జర్నలిస్ట్ లను ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా మౌనం పాటిస్తే కుదరదని ఆయన కూడా తగిన మూల్యం చెల్లిస్తాడని హెచ్చరించారు. తెలంగాణాలో ఇద్దరు మినహా శాటిలైట్ మీడియా ఛానెల్స్ నిర్వాహకులు అందరు ఆంధ్ర వాళ్లే అని, ఆంధ్ర పాలకుల ఇనుప బూట్ల క్రింద తెలంగాణ విలేకరులు నలిగిపోయేందుకు సిద్ధంగా లేరని హెచ్చరించారు. ప్రొపెసర్ నాగేశ్వర రావు మాట్లాడుతూ.. ఆంధ్ర పాలకులు వాస్తవాలు ప్రశ్నించే గొంతు నొక్కాలని చుస్తే సహించనని తాను ఏ తప్పు చెయ్యలేదని, తాను ఏ కులాన్ని రెచ్చగొట్టలేదని , గొడవలు సృష్టించలేదని ,చావనైన చస్తాను కానీ ప్రశ్నించే హక్కు వదులుకోనని మీరు కేసులు పెట్టారు కనుక మీకు భయపడి ప్రశ్నించడం ఆపనని, అరెస్ట్ కు సిద్ధంగా ఉన్నానని, బెయిల్ కూడా తెచుకొనని, జాతీయ మీడియాలో మీ నియంతృత్వ పాలన అందరికి తెలియాలని ఘాటు వ్యాక్యలు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *