సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆకివీడు మండలం, కుప్పనపూడి గ్రామంలో జరిగిన తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక, దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్, రఘురామకృష్ణ రాజు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశంలో రాముడు, కృష్ణుడు.. తెలుగు జాతి పౌరుషం అంటే అన్న ఎన్టీఆర్ గుర్తుకువస్తారని అన్నారు, ఇక ఉండి నియోజకవర్గం లో టీడీపీ 2వ రోజు మహానాడు వేడుకల నేపథ్యంలో హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న వేడుకలలో భాగంగా, పాలకోడేరు మండలంలోని వేండ్ర గ్రామం మరియు కాళ్ళ మండలంలోని సీసలి గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమాలలో , ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు కుమారుడు భరత్ పాల్గొన్నారు. పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్ కొత్తపల్లి నాగరాజుతో పాటు తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *