సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) అధ్యక్షతన నేడు, బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేంద్రమంత్రులతో ప్రధాని చర్చించారు. ఈ భేటీలో పలు నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో పశ్చిమాసియా సంక్షోభం, పెరుగుతున్న గ్లోబల్ ఆయిల్ రేట్స్, ఇంధన సంరక్షణ, సాఫ్ట్ వెర్ కంపెనీలలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ క్లాసెస్, బంగారం కొనుగోళ్ల నిలుపుదలపై చర్చించినట్లు సమాచారం.బంగారం దిగుమతి ఫై 6 శాతం నుండి 15 శాతం టాక్స్ పెంచుతూ అలాగే, ఖరీఫ్ సీజన్ మద్దతు ధరల నుంచి కోల్ గ్యాసిఫికేషన్, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయ ఆధునికీకరణ వరకు భారీ కేటాయింపులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా రైతులకు మద్దతుగా ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల (MSP) అమలుకు కేంద్ర కేబినెట్ రూ.2,60,000 కోట్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ద్వారా రైతులకు పంటలకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు మార్కెట్ లో వినియోగ దారులకు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆయా కీలక పంటలకు క్వింటాకు పెంచిన రేట్లు ఇలా ఉన్నాయి. వరి (సాధారణ రకం) – రూ.2441, వరి (గ్రేడ్ ఏ) – రూ.2461. హైబ్రిడ్ జొన్నలు – రూ.4023,మొక్కజొన్న – రూ. 2410, కందులు – రూ. 8450. పెసర్లు – రూ.8780, మినుములు – రూ.8200, పత్తి (మధ్యరకం) – రూ.8267,పత్తి (లాంగ్ రకం) – రూ. 8667, వేరుశనగ – రూ.7517. వంటల ఆయిల్ కు ఉపయోగపడే పొద్దుతిరుగుడు – రూ.8343 చప్పున ధరలు పెంచారు.
