సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీలో ప్రధాని మోడీ అడ్జక్షతన జరుగుతున్నా బ్రిక్స్ (BRICS) సదస్సులో 11 భాగస్వామ దేశాలతో పాటు ముఖ్య ఆహ్వానితులుగా 20 దేశాల పైగా అధినేతలు ప్రతినిధులు హాజరు అయ్యారు. వీరి సమావేశంలో చారిత్రక ఘట్టం నమోదైంది. ‘న్యూఢిల్లీ డిక్లరేషన్’ (New Delhi Declaration) కు కూటమిలోని సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నఇరాన్ ఫై అమెరికా దాడులు తో మొదలయిన గల్ఫ్ పశ్చిమాసియా సంక్షోభంపైనా సభ్య దేశాల మధ్య స్పష్టమైన ఏకాభిప్రాయం వ్యక్తమైంది. పశ్చిమాసియా సంక్షోభం సహా ఎలాంటి అంతర్జాతీయ సమస్యలకైనా యుద్ధం పరిష్కారం కాదని, దౌత్య మార్గాలు, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని భారత్ రష్యా, చైనా, ఇరాన్ తో సహా బ్రిక్స్ కు హాజరు అయిన అన్ని దేశాల దేశాధినేతలు,ప్రతినిధులు స్పష్టం చేశారు.( పరోక్షంగా అమెరికా) ఏకపక్ష యుద్ధ చర్యలను ఖండిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బ్రిక్స్ కూటమి ఏ రకమైన పాశ్చాత్య లేదా ఇతర వర్గానికి వ్యతిరేకంగా పనిచేసే వేదిక కాదని, అందరినీ కలుపుకొనిపోయే భాగస్వామ్య వేదిక అని అభివృద్ధి చెందుతున్న దేశాల ‘మానవాభివృద్ధే కీలకం’ అనే నమూనాను అనుసరిస్తోందన్నారు. ఇటీవల మారుతున్న గ్లోబల్ పరిణామాలకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC), ఇతర ప్రపంచ సంస్థలలో తక్షణ సంస్కరణలు చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు.
