సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశం పెద్దది జనాభా చాల తక్కువ ఉన్న కెనడా వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ఇమ్మిగ్రేషన్ శాఖ ఒక అద్భుతమైన శుభవార్త చెప్పింది. గతంతో పోలిస్తే భారత్ తో ఉన్న వివాదాలు దూరంగా పెట్టి ఇప్పుడు భారతీయుల వీసా అప్లికేషన్లు చాలా వేగంగా క్లియర్ అవుతున్నాయి. అమెరికా కు మించి కెనడా లో ఆర్ధిక సంపాదనకు కూడా భారతీయులకు అనేక అవకాశాలు ఉన్నాయి.ఇటీవల భారతీయులకు మాత్రం విజిటర్, స్టడీ వీసాల విషయంలో కెనడా పెద్ద పీట వేసింది. ఏప్రిల్ 15 వరకు ఉన్న తాజా వివరాల ప్రకారం.. భారతీయులకు విజిటర్ వీసా రావడానికి కేవలం 23 రోజుల్లోనే పూర్తవుతోంది. అదేవిధంగా కెనడాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు స్టడీ పర్మిట్ సమయం 4 వారాల నుండి 3 వారాలకు తగ్గడం వల్ల విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులు కెనడా చేరుకోవడానికి అవకాశం ఏర్పడింది. భారతీయ విద్యార్థులు తో పాటు తల్లిదండ్రులు, తాతయ్య-నానమ్మల కోసం దరఖాస్తు చేసే సూపర్ వీసా ప్రాసెసింగ్‌లో కూడా కెనడా వేగం పెంచింది. గతంలో దీని కోసం 202 రోజులు వేచి చూడాల్సి రాగా, ఇప్పుడు ఆ సమయం 182 రోజులకు తగ్గింది.
