సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం జెపి రోడ్డులోని శ్రీపద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నేడు,మంగళవారం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఈ ప్రాంతంలో ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రతి ఏడాది వేసవిలోప్రతిరోజు 40 లీటర్ల మజ్జిగ,మంచినీళ్ల చలివేంద్రం ఏర్పాటు గొప్ప విశేషమన్నారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ.. దంతులూరి జగన్నాధరాజు నాల్గొవ కుమార్తెస్వర్గీయ అల్లూరి సూరయమ్మ వేసవిలో బాటసారుల దాహార్తి తీర్చడానికి చలివేంద్రం నిమిత్తం 3.94 సెంట్లు భూదానంచేసారని, దాత ఆశయాల మేరకు వేసవిలో ప్రతిరోజు 40 లీటర్ల మజ్జిగ, మంచినీళ్ల ఏర్పాటు చేస్తున్నామన్నారు.ఈనెల 27 నుంచి మే 9వ తేదీ వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల బ్రోచర్ ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మెన్,పాలకవర్గ సభ్యులు, మరియు కారుమూరి సత్యనారాయణ మూర్తి, ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
