సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కారణాలు ఏవైనా ఇటీవల కండలు పెంచినెపంతో ఎన్టీఆర్ ‘పర్సనాలిటీ’ తగ్గిపోవడంతో పాటు కొత్త సినిమాల జోరు తగ్గిపోవడం. ఈ ఏడాది ఆయన సినిమా రిలీజ్ లేకపోవడం ఆయన అభిమానులను కలవర పెడుతూనే ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తారక్ ఫ్యాన్స్‌కు ఇప్పుడో గుడ్ న్యూస్ రాబోతుంది. వచ్చే మే 20.. తారక్ బర్త్ డే రోజు.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సర్‌ప్రైజ్‌లు సినిమాల విశేషాలు బయటకు రాబోతున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సుదీర్ఘ కాలంగా తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్‌కు అదే రోజు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా పూర్తీ చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో పురాణ దేవతల కధల ఫాంటసీతో గాడ్ ఆఫ్ వార్.. అప్డేట్‌తో పాటు ‘దేవర 2’ షూటింగ్ ప్రారంభ విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ టాక్.
