సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క పెట్రోల్ రేట్లు పెంచింది లేదు అని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుంటే.. మరో ప్రక్క తాజగా నేడు, శుక్రవారం దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్ ధరలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అందరు ఊహించినట్లే లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌‌పై సుమారు 3న్నర రూపాయలు వరకు పెంచాయి. ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. దాంతో దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో వీటి ధరలు మారాయి. అమెరికా ఇరాన్ ఫై దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ ఎదురుదాడితో విలవిలాడిన అమెరికా ఇజ్రాయిల్ అసమర్ధతతో .. ప్రపంచంలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో భారత్ లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాలని ఆయిలు కంపెనీలు నిర్ణయించాయి. దీని ప్రభావం తో దేశంలో అన్ని రవాణా చార్జీలు తదుపరి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి. గత 3న్నర ఏళ్ళు రష్యా నుండి భారీ సబ్సిడీ కి చమురు కొనుగోళ్లలో లక్షల కోట్ల లాభాలు ఆర్జించిన పెట్రోల్ వ్యాపార సంస్థలు ప్రజలకు ధరలు తగ్గించలేదు. ఇప్పడు ఇరాన్ యుద్ధం నేపథ్యంలో మాత్రం వేల కోట్ల నష్టాలు వస్తున్నాయని మాత్రం ప్రజలకు వడ్డన మొదలు పెట్టడం గమనించాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *