సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు, ఆదివారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద చేపట్టనున్న 3 లక్షల ఇళ్ళ నిర్మాణానికి కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంలో శంకుస్థాపన చేశారు.. త్రీడీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ళను నిర్మించేందుకు పైలెట్ ప్రాజెక్ట్‌గా గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంను ఎంచుకుంది. ఈ మేరకు బుర్రిపాలెంతో పాటు ఓబులనాయుడు పాలెంలో రూ.14 కోట్లతో117 ఇళ్లను నిర్మించనుంది. కేంద్ర ప్రభుత్వం, CSIR-CBRI, ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసుకొన్నారు.
