సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయదశమి , దీపావళి పండుగలు, ఛాట్ పూజ పురస్కరించుకుని ప్రయాణికుల సంఖ్యా భారీగా పెరుగుతున్న దృష్ట్యా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోని ఆంధ్ర ప్రదేశ్ మీదుగా జన సాధారణ రైళ్లు , అదనపు రైళ్లు నడుపుతామని సీపీఆర్‌వో బాలాజీ కిరణ్ ప్రకటించారు. విజయవాడ – తిరుపతి, విజయవాడ – పలాస, విశాఖ – విజయవాడ మధ్య గోదావరి జిల్లాల మీదుగా మెము ప్యాసింజర్ రైళ్లు నడుపుతామని చెప్పారు. అలాగే 135 రైళ్లకు అదనపు బోగీల సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.2028 నాటికి విశాఖపట్నంలోని ముడసరలోవలో నిర్మిస్తున్న దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం పూర్తవుతుందని చెప్పారు. ప్రస్తుతం నాలుగో ఫ్లోర్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *