సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అల్ప పీడన ప్రభావంతో భీమవరంలో నేటి మంగళవారం ఉదయం నుండి 11 గంటల వరకు భారీ వర్షం కురుస్తూనే ఉంది.ఉరుములు మెరుపులు, వర్షపు ముసురు మబ్బులతో వాతావరణం ఉండటంతో ప్రజలు బయటకు రాకపోవడంతో ప్రధాన రహదారులు సైతం ఖాళీగా ఉన్నాయి.పలు విద్య సంస్థలు సెలవు ప్రకటించాయి. పట్టణంలోని పల్లపు ప్రాంతాలతో పాటు ప్రధాన రోడ్లపై సైతం నీరు చేరింది. పట్టణంలోని మెంట్ వారి తోట కు వెళ్లే అండర్ రైల్వే టర్నల్ సగం లోటు మునిగిపోవడంతో వాహనాల రాకపోకలు నిషేదించారు. దాదాపు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే వాతావరణం కనపడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *