సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ కు చెందిన కాశ్మిర్ లోని కొంత భూభాగాన్ని ఆక్రమించిన పాకిస్తాన్ తాను ఆక్రమించిన PoK ప్రాంతాన్ని ప్రధానంగా ‘ఆజాద్ జమ్మూ కాశ్మీర్’ ‘గిల్గిత్-బాల్టిస్తాన్’ అనే రెండు రాష్ట్రాల భాగాలుగా విభజించారు. వీటి మొత్తం వైశాల్యం 90,972 చదరపు కిలోమీటర్లు. ఆజాద్ జమ్మూ కశ్మీర్‌కు పేరుకు మాత్రమే సొంత రాజ్యాంగం, ప్రధాని, అధ్యక్షుడు ఉన్నప్పటికీ, అధికారమంతా పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వ కనుసన్నల్లోనే సాగుతుంది. ఎన్నికలన్నీ వారి అధికారంలోనే జరుగుతాయి. pok అసెంబ్లీలో కూడా స్థానిక కశ్మీర్‌లో వ్యక్తులు కన్నా పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రావిన్స్‌ల నుంచి వచ్చే రాజకీయ నాయకులకు, అధికార పార్టీలకు ఈ సీట్లు కట్టబెట్టి దోపిడి చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ వేలాది ప్రజలు రోడ్లపైకి వచ్చిన గత వారం రోజులుగా చేస్తున్న శాంతియుత పోరాటంపై పాక్ సైన్యం కాల్పులు జరపింది. ఈ దాడుల్లో 32 మంది మృతి చెందగా, 200 మందికి పైగా గాయపడ్డారు. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం ఈ నిరసనకారులను ‘మిలిటెంట్లు’ అని ముద్రవేసి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. PoKలో అక్షరాస్యత రేటు 77.5% ఉన్నప్పటికీ ఉపాధి లేక యువత రోడ్డు మీద పడుతోంది. అలాగే తలసరి ఆదాయం కూడా పడిపోయింది. ఓ వైపు భారత్ జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలను కేటాయిస్తూ.. అభివృద్ధి పధంలో నడిపిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఆక్రమిత భూభాగాలను ఆక్రమిస్తూ పైకి మతం పేరు చెప్పి అక్కడి ప్రజలను, వారి వనరులను దోచుకుతింటుంది. స్థానికులు కనిపెట్టేసారు.. ఇక చూడాలి..
