సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో వాడవాడలా దేవాలయాలలో ఘనంగా దసరా వేడుకలు ప్రారంభమయ్యాయి. గునుపూడి లోని పవిత్ర పంచా రామ క్షేత్రంలో నేడు, ఆదివారం దసరా మహోత్సవాలు లో నేడు,భక్తులు పోటెత్తారు. శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి దేవస్థానంలో ఉన్న శ్రీ పార్వతి అమ్మవార్ని మొదటి రోజుగా ‘శ్రీ మహాలక్ష్మి’ అమ్మవారిగా అలంకరించగా, భక్తులు భవాని మాలదారులు పెద్ద సంఖ్యలో శ్రీ స్వామి వారితో పాటు, శ్రీ పార్వతి, శ్రీ అన్నపూర్ణ దేవి అమ్మవార్లను దర్శించుకొన్నారు. ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేసారు. భీమవరం పురాధీస్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో నిలువెత్తు శ్రీ అమ్మవారు ‘శ్రీ స్వర్ణ రజత కవచ’ అలంకారం లో ( ఫై చిత్రంలో) భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేషంగా హాజరుఅవుతున్నారు. పలు ప్రాంతాలలో దేవి ఆలయాలలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని బెంగాలీలు, జైన్స్ కాళికామాత , శ్రీ దేవి విగ్రహ ప్రతిమలను ఏర్పాటు చేసిన పందిళ్ళలో వేడుకలు 10 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. త్యాగరాజ భవనంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఎప్పటి లాగే స్థానిక ఆర్యవైశ్య సంఘం వారు మంచి సెటింగులతో, ప్రత్యేక అలంకరణతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
