సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డిఎన్నార్ కళాశాల రోడ్డులోని శ్రీదుర్గాలక్ష్మీ అమ్మవారి గుడి పునః నిర్మాణానికి భక్తిభావంతో దాతలు ముందుకు వస్తున్నారు.ప్రస్తుతం ఉన్న గుడి పంటకాలువ ఎదురుగా ఉన్న 9 సెంట్ల స్థలంలో పునర్నిర్మిస్తున్నారు . ఈ నేపథ్యంలో దసరా వేడుకలలో భాగంగా నేడు, ఆదివారం . ఓఎన్ జిసి ఉద్యోగి బాదం శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు ఆలయ పునః నిర్మాణం నిమిత్తం రూ 10 లక్షల విరాళాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మరియు ఎమ్మెల్యే అంజిబాబు, టిడిపి రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్ధసారధి చేతుల మీదుగా ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పెన్మెత్స రమేష్ రాజు, కార్యదర్శి భీమాల శ్రీరామూర్తిలకు అందించారు. అదే విధంగా పట్టణానికి చెందిన వడ్డీ సుబ్బారావు వారి కుమారుడు శ్రీకాంత్ రూ 1,00,116 లను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. ఆలయ అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం అద్వితీయమని, సుమారు రూ 4 కోట్లతో శ్రీదుర్గాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామన్నారు. భక్తులు దాతల సహకారంతో ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు శ్రీ అమ్మవారి భక్తులు పాల్గొన్నారు.
