సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల కు వెళ్లే భక్తుల రద్దీ దృష్ట్యా కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విశేష కృషితో నరసాపురం – తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు నేడు,సోమవారం భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు,NDA నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి శ్రీనివాస వర్మ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా రైల్వే కనెక్టివిటీకి పెద్దపీట వేస్తున్నారని, ప్రజల అవసరాలను గుర్తించి, సాంకేతిక నిబంధనలను అధిగమిస్తూ కొత్త రైలు సర్వీసులను మంజూరు చేయిస్తున్నారని ప్రశంసించారు. ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి సోమవారం మధ్యాహ్నం 3:50 గంటలకు నరసాపురంలో బయలుదేరి.. పాలకొల్లు, వీరవాసరం, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, గుడివాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు మీదుగా ప్రయాణించి, మరుసటి రోజు తెల్లవారుజామున 3:40 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు, పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్ లో సందడి చేసారు.
