సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు (RRR) నేడు, సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల సుప్రీం కోర్ట్ తీర్పు ఇచ్చినప్పటికీ ఎస్ సి అర్హత తొలగించవలసిన పాస్టర్ చింతాడ ఆనంద్ ఫై వెంటనే చర్యలు తీసుకోకుండా బాపట్ల జిల్లా కలెక్టర్ ఇంకా కమిటీలు వేస్తామని, ఆలస్యం చెయ్యడం అంటే స్వష్టంగా ఇచ్చిన సుప్రీం కోర్ట్ తీర్పు ను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసారు. పాస్టర్ ఆనంద్ కు మతం మారినప్పుడే ఎస్ సి హోదా పోయిందని అతను ఎస్ సి ఎస్టీ కేసులు ఇతరులపై వెయ్యడం కుదరదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడే కలెక్టర్ చర్యలు తీసుకోని ఉండవలసింది, అయితే ఆ తీర్పు ఫై ఆనంద్ సుప్రీం కోర్టుకు వెళ్లిన అక్కడ ఇదే తీర్పు ఇంకా స్వష్టంగా ఇచ్చారని కానీ బాపట్ల కలెక్టర్ అతని ఎస్ సి సర్టిఫికెట్ రద్దు చెయ్యకుండా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తుంటే నాకు కలెక్టర్ శైలిపై కూడా అనుమానం కలుగుతుందని ఘాటుగా అన్నారు రఘురామా.. ఇటీవల ఆకివీడు లో రామాలయం కోసం స్థలం చదును చేస్తే కొన్ని మీడియా ఛానెల్స్ సబ్జెక్టు తెలియకుండా ఏవో వ్యాఖ్యలుతో ప్రసారాలు చేస్తున్నాయని ఇది మంచి పద్దతి కాదని, చట్ట బద్దంగానే ప్రజా ఆమోదంతోనే రామాలయాన్ని నిర్మిస్తున్నామని రఘురామా అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *